కేజీఎఫ్ హీరో యష్ పెద్ద మనసు చాటుకున్నారు. కొవిడ్ కష్ట కాలంలో కన్నడ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ సినీ ఆర్టిస్టులు, టెక్నిషియన్లు, తదితర 3000 మందికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ రూ.5000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
"నేను సంపాదించిన దాంట్లో కొంత సాయం చేయాలనుకుంటున్నాను. మా యూనియన్ అధ్యక్షుడు శ్రీ సా రా గోవిందు, ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్తో ఈ విషయం గురించి చర్చించాను. ఆర్టిస్టులు, టెక్నిషియన్లు, కార్మికుల బ్యాంకు వివరాలు మాకు చేరిన వెంటనే ఆ మొత్తాన్ని వారికి అందిస్తాము"