'కేజీఎఫ్-2' చిత్రాన్ని అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం మొదట్లో ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఆ చిత్రీకరణ నిలిచిపోవడం వల్ల.. రిలీజ్‌లో మార్పులు ఉండవచ్చు అని సోషల్‌మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో సినిమా విడుదల విషయంలో వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాత కార్తీక్ గౌడ స్పందించారు.
జులైలో షూటింగ్స్‌కు అనుమతి ఇస్తే ముందు ప్రకటించిన రోజునే 'కేజీఎఫ్-2' చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా రెండు ఫైట్ సీన్లు మినహాయించి చాలా వరకూ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని ఆయన వెల్లడించారు.