బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. కథానాయకుడు కార్తిక్ ఆర్యన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. 'లవ్ ఆజ్ కల్2' సినిమాలో నటిస్తున్న వీరిద్దరూ, వాటికి బలం చేకూర్చుతూ పలు పార్టీలు, డిన్నర్లలో సందడి చేశారు.
తాజాగా కార్తిక్.. సారాకు తినిపిస్తున్నట్లు ఉన్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. 'నువ్వు బాగా సన్నగా అయిపోయావు. బాగా తిని మళ్లీ బరువు పెరగాలి' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సారా అలీఖాన్.. తనకు తొలి చూపు ప్రేమపై నమ్మకం ఉందని, తనదీ అదే రకమైన ప్రేమ అని చెప్పింది.
2009లో సైఫ్ అలీఖాన్ హీరోగా వచ్చిన 'లవ్ ఆజ్ కల్' మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'లవ్ ఆజ్ కల్ 2'. ఈ రెండింటికి ఇంతియాజ్ అలీనే దర్శకత్వం వహించాడు. రెండో భాగం.. ఈనెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'లవ్ ఆజ్ కల్ 2'లో కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్
ఇదీ చూడండి..పడవలో డార్లింగ్ ప్రభాస్ ప్రేమకథ