బాలీవుడ్లో స్టార్ జోడీల్లో సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్‌లది ఒకటి. అయితే వీరి ప్రేమకథలోనూ సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి. సైఫ్ కరీనాకు ప్రపోజ్ చేయగా, రెండుసార్లు ఇతడిని తిరస్కరించిందీ భామ. ఆ తర్వాతే ఒప్పుకుంది. వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన మొదట వ్యక్తి అక్షయ్ కుమార్. తమ వ్యవహారం గురించి తెలిసినా, ఈ విషయాన్ని అక్కీ రహస్యంగా ఉంచాడని చెప్పిన కరీనా.. అతడు తనకు మంచి స్నేహితుడని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ "తాషాన్' సినిమా చేస్తున్నప్పటి నుంచి సైఫ్‌ను ప్రేమిస్తున్నాను. ఈ విషయం అక్షయ్‌కు తెలిసినా చాలా రహస్యంగా ఉంచాడు. అతడు నా నిజమైన స్నేహితుడు. సైఫ్ నా కెరీర్‌లోని అన్ని పరిస్థితుల్లో మద్దతుగా నిలిచాడు. కెరీర్ ప్రారంభంలో ఏడాది పాటు అవకాశాలు వచ్చాయి.. మంచి సినిమాలు చేశాను. కానీ, సంవత్సరం తర్వాత ఛాన్స్‌లు తగ్గిపోయాయి. అంతటితో నా కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నా. అదే సమయంలో నన్ను జీరో సైజ్‌కు మారమని సలహా ఇచ్చాడు సైఫ్. అలా నా కెరీర్ తోడ్పాటు అందించాడు"
- కరీనా కపూర్, బాలీవుడ్ నటి
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ సైఫ్-కరీనా గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం
1) 'తాషాన్' సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే సైఫ్ అలీఖాన్‌పై మనసు పారేసుకున్నట్లు కరీనా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
2) తన మోచేతిపై కరీనా పేరు పచ్చబొట్టు వేయించుకుని సైఫ్ అలీఖాన్ అప్పట్లో వార్తల్లో నిలిచారు.
3) ఆ తర్వాత వారిద్దరూ కలిసి సహజీవనం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కరీనా. "తనతో జీవితాంతం కలిసుండాలని నిశ్చయించుకున్నా. మేమిద్దరం సహజీవనం చేస్తాం" అని కరీనా తల్లిని సైఫ్ అడగ్గా.. దానికి ఆమె అంగీకరించింది.
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 4) బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమం నాలుగో సీజన్‌లోని ఓ ఎపిసోడ్లో వీరిద్దరూ పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్లో సైఫ్-కరీనా కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని అభిమానులు చర్చించుకున్నారు.
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 5) సహజీవనం చేస్తున్న సమయంలో వీరిద్దరూ పారిస్‌కు విహారయాత్రకు వెళ్లగా, ఆ సమయంలో కరీనాతో సైఫ్ తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పారు. అప్పటికే రెండు సార్లు దీనిని తిరస్కరించిన ఈ భామ.. మూడోసారి అంగీకరించింది. తొలిసారి బార్లో, రెండోసారి నోట్రే డామే చర్చ్‌లో సైఫ్ తన ప్రేమను వ్యక్తపరిచారట.
6)ఆసక్తికర విషయం ఏమిటంటే, 'యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్' చిత్రీకరణలో భాగంగా సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్.. సైఫ్ తల్లి షర్మిళా ఠాగూర్‌కు పారిస్‌లోనే ప్రేమను వ్యక్తం చేశారట. అదే నగరంలో కరీనా.. సైఫ్ ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత వీరిద్దరికీ వివాహం జరిగింది.
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 7) ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య 2012 అక్టోబరు 16న సైఫ్-కరీనాల పెళ్లి జరిగింది. ఆ ఏడాది ఎక్కువగా చర్చించుకున్న అంశంగా ఇది నిలిచింది.
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 8) 2016 డిసెంబరు 20న ఈ జంటకు తైమూర్ అలీఖాన్ జన్మించాడు.
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇదీ చూడండి... మోడల్ నుంచి కథానాయికగా.. పాత్రేదైనా