తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''పుష్ప' కలెక్షన్లను హిందీ సినిమాలూ అందుకోలేకపోతున్నాయి'

Pushpa Movie: హిందీలో విడుదలైన 'పుష్ప' బాలీవుడ్​ సినిమాల కన్నా అధికంగా కలెక్షన్స్​ రాబడుతోందని చెప్పారు నిర్మాత కరణ్ జోహర్. బన్నీ స్టార్​డమ్​ వల్లే సినిమాకు భారీ ఓపెనింగ్స్​ వచ్చాయని అన్నారు.

Pushpa Movie
పుష్ప

By

Published : Dec 28, 2021, 12:25 PM IST

Pushpa Movie: తెలుగు సినిమాల కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యానించారు. అందుకు అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమానే ఉదాహరణగా చూపించారు. సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన 'పుష్ప' చిత్రం.. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లో ఈ చిత్రంతో.. బన్నీకి మరింత క్రేజ్‌ పెరిగింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సినిమాపై, బన్నీపై ప్రశంసలు కురిపించగా.. ఇటీవలే కరణ్‌ జోహార్‌ కూడా కొనియాడారు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయని అన్నారు. బన్నీకి బాలీవుడ్‌లో ఆ స్టార్‌డమ్‌ రావడానికి గల కారణాన్ని కూడా కరణ్‌ వివరించారు.

'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్

"ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు సినిమాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో ఆయా నటులకు కూడా ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కి బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. దాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే, హిందీలో విడుదలైన 'పుష్ప'కు కూడా భారీ ఓపెనింగ్‌ కలెక్షన్లు వచ్చాయి. హిందీ సినిమాలు కూడా అంత కలెక్షన్స్‌ రాబట్టలేకపోయాయి" అని కరణ్‌ జోహర్‌ తెలిపారు.

ఇదీ చూడండి:డిఫరెంట్​ స్టోరీస్​తో వచ్చారు.. హ్యాట్రిక్​ హిట్​ కొట్టారు!

ABOUT THE AUTHOR

...view details