యువహీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు, బాలీవుడ్‌లోని నెపోటిజమ్ ఓ కారణమని భావించిన నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖుల్ని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ ట్రోలింగ్ బారినపడ్డాడు. ఈ నేపథ్యంలో స్పందించిన కరణ్ స్నేహితుడు.. వీటివల్ల అతడు చాలా మనోవేదనకు గురైనట్లు వెల్లడించారు. దీంతోపాటే కరణ్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు.
"బయటవాళ్లతో పాటు తెలిసిన వారు కూడా కరణ్‌ను విమర్శిస్తున్నారు. దీంతో తానే అపరాధం చేశానని బాధపడుతున్నాడు. అతడి మూడేళ్ల వయసున్న కవల పిల్లల్ని చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ ఘటనతో అసలు సంబంధమే లేని హీరోయిన్ అనన్య పాండేను సుసైడ్ చేసుకోమని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు" -కరణ్ స్నేహితుడు