తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ డైరక్టర్​ తర్వాతి సినిమా ఎన్టీఆర్​తోనా..! - కె జి ఎఫ్

'కె.జి.ఎఫ్' సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్.. తర్వాతి సినిమా ఎన్టీఆర్​తో చేయనున్నాడని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించనుంది.

ఆ డైరక్టర్​ తర్వాతి సినిమా ఎన్టీఆర్​తోనా..!

By

Published : Jun 6, 2019, 1:12 PM IST

ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు జూ.ఎన్టీఆర్. అతడి తర్వాతి సినిమాపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. 'కె.జి.ఎఫ్'ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.

ఇదీ కారణం..

ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. వెంటనే అభిమానుల్లో చర్చ మొదలైంది. ఎన్టీఆర్​తో ఈ డైరక్టర్ సినిమా చేస్తాడంటూ చర్చించుకుంటున్నారు.

ప్రశాంత్ నీల్​కు పుట్టినరోజు చెపుతూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్

ప్రస్తుతం 'కె.జి.ఎఫ్' సీక్వెల్​తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు ఫలిస్తే 2020 చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.

ఇది చదవండి: టిక్​టాక్​లో 'జూనియర్ ఎన్టీఆర్' సందడి

ABOUT THE AUTHOR

...view details