హీరోగానే కాకుండా నిర్మాతగానూ ఆకట్టుకుంటున్నాడు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. తాజాగా బైకర్స్ జీవితాల ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు రెన్సిల్ డి సిల్వా దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. జులైలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.
బైకర్స్ జీవితాలపై జాన్ అబ్రహం సినిమా - రెన్సిల్ డి సిల్వా
జాన్ అబ్రహం బైకర్స్‌పై ఓ సినిమా నిర్మించనున్నాడు. రెన్సిల్ డిసిల్వా దర్శకత్వం వహించే ఈ చిత్రం జులైలో పట్టాలెక్కనుంది. అజయ్ కపూర్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
"అజయ్ కపూర్, రెన్సిల్ డిసిల్వాతో కలిసి పనిచేయబోతున్నందుకు ఆనందగా ఉంది. రోడ్లపై బైక్‌తో దుమ్ము రేపే యాక్షన్ సన్నివేశాల కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను" -జాన్ అబ్రహం
విక్కీ డోనార్, మద్రాస్ కేఫ్, ఫోర్స్ 2, పరమాణు ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్ లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు జాన్ అబ్రహం. ప్రస్తుతం ఆయన నటించిన ఆఏడబ్యూ(రోమియో అక్బర్ వాల్టర్) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి జాన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 2009లో వచ్చిన కుర్బాన్ చిత్రం ద్వారా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు డిసిల్వా.