ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ తన భార్య అవంతికతో దాదాపుగా విడిపోయినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్, అవంతిక మాలిక్‌ను ఎనిమిదేళ్ల కిందట పెళ్లి చేసుకొన్న సంగతి తెలసిందే. వీరికి నాలుగేళ్లు కూతురు ఉంది. అవంతిక తన కూతురుతో కలిసి తల్లితోనే ఉంటుంది.
ఇమ్రాన్, అవంతిక విడిపోతున్నారట...!
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ తన భార్య అవంతిక విడిపోతున్నారని సమాచారం.
అయితే విశేషం ఏంటంటే ఇప్పటి వరకు ఇద్దరు విడాకుల కోసం ఎటువంటి న్యాయ సలహాలు తీసుకోలేదు. ఇదే విషయాన్ని కొంతమంది సినీ సన్నిహితులు భార్యభర్తలను అడగ్గా సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తామంటూ సమాధానమిచ్చారట. మొత్తం మీద వ్యవహారం వీధిన పడకుండా ఎవరికి వారు విడిగా ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. 2015లో ఇమ్రాన్ ఖాన్ నిఖిల్ అడ్వాణి దర్శకత్వంలో నటించిన చిత్రం 'కట్టి బట్టి' ఇందులో కంగనా రనౌత్ కథానాయికగా నటించింది.
ఇవీ చూడండి.. సాహో పోస్టర్ విడుదల.. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్