తమన్నా కథానాయికగా తమిళంలో నటిస్తున్న వెబ్‌సిరీస్ 'నవంబర్ స్టోరీ'. ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. త్వరలో రానున్న ఈ సిరీస్ గురించి మాట్లాడిన తమన్నా.. ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
అప్పుడే నాకు నిజమైన ఆనందం: తమన్నా
తాను నటించిన తమిళ తొలి వెబ్ సిరీస్ 'నవంబర్ స్టోరీ'.. త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది తమన్నా. ప్రేక్షకులు మెచ్చుకున్నప్పుడే తనకు నిజమైన ఆనందమని తెలిపింది.
"ఈ సినిమాలో నాలోని సృజనాత్మకతో పాటు నటనలో నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు సహాయపడింది. మనం ఏ పాత్ర అయితే పోషిస్తామో అది అభిమానులు మెచ్చుకొని ఆనందిస్తారో అప్పుడే నాకు నిజమైన ఆనందం ఉంటుంది. సినిమా చిత్రీకరణ చేసిన మొదటివారంలోనే కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేసాం. ఎందుకంటే ఆ పాత్రకు సంబంధించి మా టీం అంతగా సంతృప్తి చెందలేదు. చిత్రంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. డైలాగ్స్ మాడ్యులేషన్ పాటు ఎలా చెప్పాలి దానిపై కూడా చాలా శ్రద్ధ చూపాం. నా పాత్ర (అనురాధ) బాగా రావడానికి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి నటించాను. అందుకే అనురాధ పాత్ర బాగా చేశానని నమ్ముతున్నాను" అని తమన్నా తెలిపింది.
చిత్రంలో జీఎం కుమార్ కీలక పాత్రలో నటించగా పసుపతి, వివేక్ ప్రసన్న, అరుళ్ దాస్, నందిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇటీవల సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మే 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీలో తమిళ, తెలుగు, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం తమన్నా- గోపీచంద్‌తో కలిసి నటించిన ‘సీటీమార్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా నటిస్తోంది. ఇంకా ఆమె 'ఎఫ్ 3', 'గుర్తందా శీతాకాలం', 'మాస్ర్టో'ల్లో నాయికగా నటిస్తోంది.