తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Samantha: రాజీ కథ మనకు ఎంతో అవసరం

సమంత అక్కినేని (Samantha Akkineni) ప్రధాన పాత్రలో నటించిన వెబ్​ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (The Family Man Season 2). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్​లో సామ్ నటనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఈ అభినందనల పట్ల సంతోషం వ్యక్తం చేసిన సమంత.. ఓ సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

samantha
సమంత

By

Published : Jun 5, 2021, 10:58 AM IST

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని (Samantha Akkineni) కీలకపాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (The Family Man Season 2). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌ శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌(Amazon Prime)లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో రాజ్యలక్ష్మి అలియాస్‌ రాజీ పాత్రలో సమంత నటన అద్భుతంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, రాజీ పాత్రకు వస్తోన్న ప్రశంసల గురించి నటి సమంత తాజాగా స్పందించారు. రాజీ తనకెంతో స్పెషల్‌ అని అన్నారు.

"ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' సిరీస్‌కు వస్తోన్న కామెంట్లు, రివ్యూలు చూసి నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ సిరీస్‌లో నేను పోషించిన రాజీ పాత్ర నాకెప్పటికీ ఎంతో స్పెషల్‌. ఈ సిరీస్‌ గురించి దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే నన్ను సంప్రదించినప్పుడు.. రాజీ పాత్ర పోషించడానికి సెన్సిటివిటీ, బ్యాలెన్స్ ఎంతో అవసరమనుకున్నా. ఈలం యుద్ధంలో తమిళుల పోరాటాలు.. ముఖ్యంగా మహిళల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసే కొన్ని డాక్యూమెంటరీలను క్రియేటివ్‌ టీమ్‌ నాకు పంపించింది. వాటిని చూసి నేను భయపడ్డా. వాళ్ల కష్టాలు, కన్నీటి గాథలను చూసి బాధపడ్డా. ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ప్రపంచం వాళ్ల వైపు కూడా చూడలేదు. రాజీ కథ, కల్పితమైనప్పటికీ, అసమాన యుద్ధం కారణంగా మరణించినవారికి, ఆ బాధాకరమైన జ్ఞాపకాల్లో జీతవిస్తున్న వారికి ఇది ఒక నివాళి. రాజీ కథ మనకు ఎంతో అవసరం. ద్వేషం, అణచివేత, దురాశతో పోరాడటానికి మనుషులుగా కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను" అని సమంత పేర్కొన్నారు.

ఇవీ చూడండి:The Family Man 2 Review: సమంత పాత్రతో డబుల్ థ్రిల్లింగ్!

ABOUT THE AUTHOR

...view details