తండ్రి చనిపోయిన ఐదు సంవత్సరాల వరకు డిప్రెషన్లో ఉన్నట్లు తెలిపింది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. బాధ నుంచి బయటపడటానికి తానెలాంటి చికిత్సా తీసుకోలేదని వెల్లడించింది. చీకట్ల నుంచి రంగుల ప్రపంచంలోకి రావాలని చేతనంగా తీసుకున్న నిర్ణయం వల్లే సాధారణ స్థితిలోకి రాగలిగినట్లు తన బయోగ్రఫీ 'అన్ఫినిష్డ్'లో చెప్పింది.
హృతిక్ సాయం..
ప్రియాంక తండ్రి డా.ఆకాశ్ చోప్రా క్యాన్సర్ కారణంగా 2013 జూన్ 10న మరణించారు. ఆయన భారత ఆర్మీలో ఫిజీషియన్‌గా పనిచేశారు. "2006లో నాన్న చికిత్స కోసం అత్యవసరంగా లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎయిర్ఇండియాలో తనకు తెలిసినవారి ద్వారా ఫ్లైట్ ఏర్పాటు చేశారు హృతిక్ రోషన్." అని తెలిపింది.
'డాడీస్ లిటిల్ గర్ల్' అని టాటుతో "పని చేయడమే నాకు చికిత్సలా పనిచేసింది. 2014లో విడుదలైన 'మేరీ కోమ్' షూటింగ్లో నా శోకం, ఆత్మను నింపి పాల్గొన్నా. అదే నన్ను ముందుకు నడిపించింది. చిత్ర నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ చిత్రీకరణ వాయిదా వేస్తానని అన్నారు. నేను అంగీకరించలేదు. మా నాన్న నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, పని పట్ల గౌరవం అందుకు ఒప్పుకోనివ్వలేదు" అని అని ప్రియాంక చెప్పింది.
అయితే పలువురు వైద్యులకు చూపించినప్పటికీ అమితమైన బాధ, డిప్రెషన్ నుంచి కోలుకోలేదని ప్రియాంక వెల్లడించింది. ఎంత ప్రయత్నించినా అందులోనుంచి బయటపడలేక పోయినట్లు తెలిపింది. ఒకానొక సమయంలో జీవితం నుంచి పారిపోకుండా ఎదురీది ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. అప్పటినుంచి సాధారణ స్థితికి రాగలిగినట్లు చెప్పింది.
'అన్ఫినిష్డ్' పుస్తకంతో ప్రియాంక ఇదీ చూడండి:'ఎప్పటికీ నువ్వే నా ప్రేమ'.. సినీ తారల పోస్టులు