ప్రియాంక చోప్రా వల్ల తనకు అవకాశాలు రావట్లేదని ఆమె కజిన్ మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఓ జూమ్ కాల్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకుంది. ఆమె సోదరిని కావడం వల్ల నిర్మాతలు తనను తీసుకోవట్లేదని తెలిపింది.
"ప్రియాంక వల్ల నాకు ఏ పని రావట్లేదు. ఆమె సోదరిని కావడం వల్ల నిర్మాతలు నన్ను తీసుకోవడం లేదు. ప్రియాంక వల్ల నా కెరీర్లో ఎలాంటి ఎదుగుదల కూడా లేదు" అని మీరా చోప్రా చెప్పింది.