తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అలాంటి పాత్రలు అసలు నచ్చవు' - tollywood news latest

'తోలుబొమ్మలాట'తో హీరోయిన్​గా పరిచయమవుతున్న తెలుగమ్మాయి హర్షిత చౌదరి. త్వరలో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించింది. సినిమా విశేషాలు పంచుకుంది.

హీరోయిన్​ హర్షిత చౌదరి

By

Published : Nov 15, 2019, 7:56 AM IST

'బోల్డ్‌ పాత్రలు నచ్చవు. డ్రెస్సింగ్‌ విషయంలోనూ నాకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి' అని అంటోంది హీరోయిన్ హర్షిత చౌదరి. 'తోలుబొమ్మలాట' చిత్రంతో వెండితెరకు పరిచయమవుతున్న పదహారణాల తెలుగమ్మాయి హర్షిత. రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించారు. విశ్వంత్, వెన్నెల కిశోర్, దేవి ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాగంటి విశ్వనాథ్‌ దర్శకుడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ నేపథ్యంలో గురువారం.. హర్షిత హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

  • "నేను పుట్టింది ఆంధ్రాలోని ప్రకాశంలోనైనా పెరిగింది మొత్తం హైదరాబాద్‌లోనే. మాస్‌ కమ్యూనికేషన్‌ చదువుతున్నాను. వెండితెరపైకి రాకముందు కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించా. తర్వాత ఆ అనుభవంతోనే సినిమాల్లో ప్రయత్నించి 'తోలుబొమ్మలాట'లో అవకాశం దక్కించుకున్నా. నిజానికి ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుందని ఇంట్లో చెప్పినప్పుడు మా అమ్మానాన్న వద్దన్నారు. కానీ నా ఆసక్తి చూసి ఒప్పుకున్నారు. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. ముఖ్యంగా నా తల్లిదండ్రులతో కలిసి చూడగలిగేలా పద్ధతైన పాత్రల్లో నటించడమంటే చాలా ఇష్టం" -హర్షిత, హీరోయిన్
    హీరోయిన్​ హర్షిత చౌదరి
  • "నేను ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటానో.. ఆ తరహా పాత్రనే ఇందులో పోషించా. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఇందులో నేను రాజేంద్రప్రసాద్‌కు మనవరాలిగా కనిపిస్తాను. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసే యువతిని. నా పాత్ర చాలా అమాయకంగా, పద్ధతిగా ఉంటుంది. దర్శకుడు తొలి ప్రయత్నంలోనే ఇలాంటి కథను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. కానీ, ఆయన చాలా బాగా తెరకెక్కించారు. మంచి బలమైన సంభాషణలు అందించారు. ప్రతి చిన్న పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది. పాటలతో మా బంధాలను ఎంతో చక్కగా ఆవిష్కరించారు" -హర్షిత, హీరోయిన్
    హీరోయిన్​ హర్షిత చౌదరి
  • "రాజేంద్రప్రసాద్‌ వంటి సీనియర్‌ నటులతో చేస్తున్నప్పుడు ఎవరికైనా కాస్త భయంగానే ఉంటుంది. నాకూ మొదట్లో అలాగే అనిపించింది. ఆయన నటన నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను. అయితే ఫస్ట్‌కాపీ చూసుకున్నాక నా పాత్ర ఇంకా బాగా చేసుంటే బాగుండేదేమో అని అనిపించింది. ఈ సినిమాతో సమయపాలన, సానుకూల దృక్పథం వంటివి అలవర్చుకున్నా. ప్రస్తుతం ఓ కథ వింటున్నా.. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను" -హర్షిత, హీరోయిన్
    హీరోయిన్​ హర్షిత చౌదరి

ABOUT THE AUTHOR

...view details