ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన 'ఉప్పెన'.. బాక్సాఫీస్ దగ్గర ఎంతలా సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలిసినిమాతోనే మెగాహీరో వైష్ణవ్‌తేజ్-ముద్దుగుమ్మ కృతిశెట్టి ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. క్యూట్ జోడీ అని ప్రేక్షకులతో పిలిపించుకున్నారు. అయితే ఈ సినిమా కథ వైష్ణవ్ కోసం రాసింది కాదట. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు.
సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు.. కొన్నేళ్ల క్రితం విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాసుకున్నారట. అయితే 'అర్జున్‌రెడ్డి' తర్వాత విజయ్ ఇమేజ్ మారిపోయింది. దీంతో కథలో చిన్నపాటి మార్పులు చేసి, వైష్ణవ్‌ను కథానాయకుడిగా ఎంపిక చేశారట. ఒకవేళ ఈ సినిమా విజయ్ దేవరకొండ చేసి ఉంటే ఎలాంటి సంచలనాలు సృష్టించేదో?