వైవిధ్యభరిత కథల్లో నటించేందుకు ఆసక్తి చూపే హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. గతేడాది 'తెనాలి రామకృష్ణ'గా ప్రేక్షకుల్ని నవ్వించి, ఇప్పుడు 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అనే స్పోర్ట్స్ డ్రామాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కరోనా దెబ్బకు చిత్రీకరణ దశలోనే ఆగింది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తొలిసారిగా సిక్స్‌ప్యాక్‌తో దర్శనమివ్వబోతున్నట్లు తెలియజేశాడు.
తొలిసారి అలా కనిపించనున్న సందీప్‌కిషన్
ప్రేమకథా, హాస్యభరిత చిత్రాల్లో నటిస్తూ, అలరిస్తున్న హీరో సందీప్ కిషన్.. తన కొత్త సినిమాలో తొలిసారిగా సిక్స్‌ప్యాక్‌తో కనిపించబోతున్నాడు.
హీరో సందీప్ కిషన్
ఓ వైవిధ్యమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, కేవలం 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సందీప్ స్పష్టం చేశాడు. తమిళ చిత్రం 'నట్పే తునై'కు రీమేక్‌గా దీనిని రూపొందిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్.
లాక్‌డౌన్ తర్వాత ఓ యువ దర్శకుడితో, కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తానని సందీప్ చెప్పాడు. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలిపాడు.