తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్వదేశానికి హీరో రానా.. త్వరలో షూటింగ్​లకు - rana daggubati back to india

హీరో రానా.. దాదాపు రెండు నెలల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

రానా

By

Published : Oct 6, 2019, 11:19 AM IST


కొంతకాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న హీరో రానా.. మళ్లీ అభిమానులను పలకరించాడు. ఈరోజు (ఆదివారం) ఉదయం ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశాడు. చాలా రోజుల తర్వాత భారత్​కు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నాడు. అయితే ఇటీవలే అతడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అభిమానుల్ని కలవరపెడుతున్నాయి.

రానా ట్వీట్

దాదాపు రెండు నెలలు అమెరికాలో ఉన్నాడురానా. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బిజిగా ఉన్నాడు. తెలుగులో 'విరాట పర్వం' షూటింగ్ దశలో ఉంది. సాయిపల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. హిందీలో అక్షయ్ కుమార్​తో చేసిన 'హౌస్ ఫుల్ 4' దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. నితిన్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. ఆసక్తికర టైటిల్

ABOUT THE AUTHOR

...view details