తెలంగాణ

telangana

By

Published : Sep 19, 2019, 7:43 PM IST

Updated : Oct 1, 2019, 6:08 AM IST

ETV Bharat / sitara

అబ్బాయితో ప్రేమలో పడిన ఆయుష్మాన్​ ఖురానా..!

బాలీవుడ్​లో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న నటుడు ఆయుష్మాన్​ ఖురానా. ఇటీవలే 'అంధాధున్'​ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న ఈ హీరో... 'డ్రీమ్​గర్ల్'​గా ప్రస్తుతం అలరిస్తున్నాడు. తాజాగా అతడు గే పాత్రలో నటిస్తున్న 'శుభ్​ మంగళ్​ జ్యాదా సావధాన్' సినిమాలోని ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

అబ్బాయితో ప్రేమలో పడిన ఆయుష్మాన్​ ఖురానా..!

జాతీయ ఉత్తమ నటుడు ఆయుష్మాన్​ ఖురానా.. ఇటీవలే'డ్రీమ్​గర్ల్'లో చీరకట్టుతో అకట్టుకున్నాడు. ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లు రాబడుతోందీ చిత్రం. ఇప్పుడు గే పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. 'శుభ్​ మంగళ్​ జ్యాదా సావధాన్'​ అనే సినిమాలో ఈ విభిన్న రోల్​లో కనిపించనున్నాడు.​ హితేశ్​ కేవల్య దర్శకత్వం వహిస్తున్నాడు. జితేంద్ర కుమార్​, గజరావ్​ రావ్​, నీనా గుప్తా కీలకపాత్రలు పోషించారు.

గురువారం ఈ సినిమా నుంచి ఓ కార్టూన్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఆయుష్మాన్.. కార్తిక్‌ సింగ్‌ అనే పాత్రలో కనిపించనున్నాడు. అమన్‌ త్రిపాఠి పాత్రలో దర్శనమివ్వనున్నాడు జితేంద్ర కుమార్‌.

కథేంటి..?

ఈ ఇద్దరూ తొలి చూపులోనే ప్రేమలో పడతారు. ఇద్దరు మగవాళ్ల మధ్య చిగురించిన లవ్​... ఎంత దూరం ప్రయాణించింది.? చివరకు ఏమైంది.? ఈ క్రమంలో వారికి సమాజం నుంచి ఎదురైన సవాళ్లేంటి అన్నదే కథాంశం. 2017లో వచ్చిన 'శుభ్‌ మంగళ్‌ సావధాన్‌'కు సీక్వెల్​. వచ్చే ఏడాది మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.'విక్కీ డోనర్‌', 'అంధాధున్‌', 'బదాయి హో' వంటి ప్రయోగాత్మక కథలతో హిట్లు అందుకున్నాడు ఆయుష్మాన్​ ఖురానా.

ఇదీ చూడండి...

Last Updated : Oct 1, 2019, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details