తెలంగాణ

telangana

గేమ్​ ఓవర్​: తాప్సీ భయానికి కారణం?

తాప్సీ ప్రధానపాత్రలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన చిత్రం 'గేమ్ ఓవర్'. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

By

Published : May 30, 2019, 5:00 PM IST

Published : May 30, 2019, 5:00 PM IST

తాప్సీ

తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గేమ్‌ ఓవర్‌'. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది.

ట్రైలర్లో.. తాప్సీ పరిగెడుతూ ఉంటుంది. ఇంట్లో ఎదురుగా ఉన్న మానిటర్‌పై వాటంతటవే గేమ్స్‌ ప్లే అవుతుంటాయి. తాప్సీ గదిలోనే చక్రాల కుర్చీలో ఉంటూ భయపడుతుంటుంది... ఇంట్లో ఎవరో తరుముతున్నట్లు చక్రాలను చేతులతో ముందుకు తోసుకుంటూ అరుస్తూ ఉంటుంది... ఇంట్లో హీరోయిన్ తప్ప మరెవరూ ఇందులో కనిపించరు... చివర్లో ఇల్లంతా తగలబడిపోతున్నట్లు ట్రైలర్‌ ముగుస్తుంది. వై నాట్‌ స్టూడియో పతాకంపై తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్‌ చిత్రానికి ఎస్‌.శశికాంత్‌ నిర్మాత. జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. దొరసాని... ఓ సారి ఇటు చూడవా...!

ABOUT THE AUTHOR

...view details