టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూతురు సితార.. తన అమ్మ నమత్ర, నాన్న మహేశ్‌లకు గ్రీటింగ్ కార్డ్ ద్వారా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. దానికి బదులుగా మహేశ్.. "థ్యాంక్యూ సీతూ పాప. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు" అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ తన భర్త సైఫ్ అలీఖాన్, కొడుకు తైమూర్లపై ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేమను పంచుకుంది. "ఇలాంటి మీసంతో ఉన్నా.. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా ప్రియా. హ్యాపీ వాలెంటైన్స్ డే." అని సైఫ్‌కు చెప్పింది. ఇక తన కొడుకు తైమూర్ అలీఖాన్ ఫొటో షేర్ చేసిన కరీనా.. "నువ్వు నాలా మూతి పెట్టినందుకు కాదు.. నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం.. నువ్వు నా హృదయ స్పందన" అని రాసుకొచ్చింది.
హిందీ నటుడు రాజ్ కుమార్ రావ్ కుడా తన ప్రేయసి పత్రలేఖపై ఇన్‌స్టా వేదికగా ప్రేమను కురిపించాడు. "నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణం. నన్ను నవ్విస్తున్నందుకు, పరిపూర్ణం చేసి, ఇంకా మెరుగ్గా తయారయ్యేలా కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు. నా వల్ల కూడా నీకు సంతోషం లభిస్తుందని అనుకుంటున్నా." అని రాసుకొచ్చాడు.
"ప్రతిరోజు.. ప్రతిచోట.. నీకు ప్రేమ" అని వరుణ్ ధావన్ తన భార్య నటాషా దలాల్‌కు చెప్పాడు.
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై తన ప్రేమను చాటుకుంది అతని భార్య, నటి అనుష్క శర్మ. "మనకు ఇదొక్కటే ప్రత్యేకమైన రోజు కాదు. అయినా చెప్పాలనుకుంటున్నా. ప్రతి రోజు, ఎప్పటికీ, ఆ తర్వాత కూడా.. నువ్వే నా ప్రేమ.
తన భర్త రాజ్ కుంద్రాపై ప్రేమతో "అప్పటినుంచి ఇప్పటి వరకు మన నవ్వులు మారలేదు. ఐ లవ్ యూ మై కుకీ." అని రాసింది బాలీవుడ్ నటి శిల్పా శెట్టి.