తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ సంతోష్​ శివన్​ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఫొటోగ్రాఫర్​, దర్శకుడు శివన్​(Sivan) కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Filmmaker Santosh Sivan's father no more
సినీ పరిశ్రమలో మరో విషాదం.. దర్శకుడు మృతి

By

Published : Jun 24, 2021, 5:06 PM IST

Updated : Jun 24, 2021, 6:48 PM IST

ప్రముఖ మలయాళ ఫొటోగ్రాఫర్​, దర్శకుడు శివన్​(89) మరణించారు. గురువారం ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన తర్వాత తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా మన్ననలు పొందిన తొలి కేరళ ప్రెస్​ ఫొటోగ్రాఫర్​గా శివన్​(Sivan) గుర్తింపు పొందారు.

ఆరు దశాబ్దాల క్రితం స్టిల్​ ఫొటోగ్రాఫర్​గా తన కెరీర్​ను ప్రారంభించిన శివన్​.. కొద్ది సంవత్సరాల్లోనే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1959లో కేరళలోని త్రివేండ్రంలో శివన్​ ఫొటో స్టూడియోను ప్రారంభించారు. కేరళ తొలి క్యాబినేట్​ ప్రమాణ స్వీకార ఘట్టాన్ని​ శివన్​.. తన కెమెరాలో బంధించారు.

ఆ తర్వాత ఫొటోగ్రాఫర్​ వృత్తిని వదిలి.. సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా 1991లో తొలి చిత్రాన్ని రూపొందించారు శివన్​. ఉత్తమ పిల్లల చిత్రంగా జాతీయ పురస్కారం దక్కించుకున్న 'అభయం' అనే సినిమా శివన్​ దర్శకత్వంలోనే తెరకెక్కింది. వీటితో పాటు 'యాగం', 'మోహన్​గల్​', 'కిలివతిల్​' వంటి చిత్రాలకు పురస్కారాలను అందుకున్నారు.

శివన్​ తీసిన కొన్ని చిత్రాలను నేషనల్​ జియోగ్రాఫిక్​, స్పాన్​, న్యూస్​వీక్​ వంటి ప్రతిష్ఠాత్మక మ్యాగజైన్​లు ప్రచురించాయి. ఇప్పుడాయన మార్గంలోనే తన కుమారుడు సంతోష్​ శివన్​(Santhosh Sivan) కూడా ఫొటోగ్రాఫర్​గా కెరీర్​ ప్రారంభించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు సంతోష్​ కెరీర్​లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇదీ చూడండి..Sonu Sood Supermarket: పది కోడిగుడ్లు కొంటే బ్రెడ్​ ప్యాకెట్​ ఫ్రీ!

Last Updated : Jun 24, 2021, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details