నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. సతీష్ వేగేశ్న దర్శకుడు. మెహరీన్ కౌర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసే అభిమానులకు శుభవార్త చెప్పింది చిత్రబృందం. విడుదల తేదీని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది.
మంచోడు ఆ రోజు వచ్చేస్తున్నాడు.. - entha manchivaduvura release on pongal
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న' ఎంత మంచివాడవురా' విడుదల తేదీ ఖరారైంది. జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
కల్యాణ రామ్
షూటింగ్ ప్రారంభంలోనే సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకచించారు నిర్మాతలు. తాజాగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇవీ చూడండి.. త్వరలో పట్టాలెక్కనున్న వెంకీ-తరుణ్ చిత్రం..!
Last Updated : Nov 8, 2019, 3:08 PM IST