తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విడుదలకు ముందే భలే సీన్స్ చూపించారు!

హీరో కల్యాణ్​రామ్ 'ఎంత మంచివాడవురా' సినిమా బ్లోపర్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో మెహరీన్ కథానాయికగా కనిపించనుంది.

By

Published : Jan 12, 2020, 5:11 AM IST

kalyan ram-mehreen
ఎంత మంచివాడవురా బ్లపర్స్

నందమూరి కల్యాణ్​రామ్ 'ఎంత మంచివాడవురా..!' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ సందర్భంగా బ్లోపర్స్ వీడియోను విడుదల చేసింది. ఇందులో చాలా మంచి సన్నివేశాలను, షూటింగ్​ మధ్యలో జరిగిన సరదా సంఘటనలను చూపించారు.

ఈ సినిమాలో హీరోయిన్​గా మెహరీన్ నటించింది. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందించారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించారు. ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details