ప్రధాని నరేంద్ర మోదీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'పీఎం నరేంద్ర మోదీ'. ఈ చిత్ర విడుదలపై వివాదం కొనసాగుతోంది. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ రోజే సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే... లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు చిత్రాన్ని నిలిపివేయాలని విపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. అదే అభ్యర్థనతో కాంగ్రెస్ నేత ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల వేళ ఈ సినిమా విడుదలైతే అభ్యర్థుల పోటీపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సోమవారం జరగనుంది.
తర్జనభర్జనలో ఈసీ..
చిత్ర విడుదలపై ఎన్నికల సంఘం సోమవారంలోపు స్పష్టత ఇచ్చే అవకాశం లేదు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు చిత్రంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
మోదీ బయోపిక్ విడుదల నిర్ణయాన్ని 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్' (సీబీఎఫ్సీ)కే వదిలేసే విషయాన్నీ ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.
ఎన్నికల నియమావళి...