తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దుల్కర్ నయా కారు అదుర్స్​.. ధర తెలిస్తే షాక్!

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్​.. ఇటీవల తన 35వ పుట్టినరోజును జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా రూ. 2.45కోట్ల విలువైన మెర్సిడెస్​ కారును కొనుగోలు చేశాడు దుల్కర్. దీనికి సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Dulquer Salmaan
దుల్కర్

By

Published : Aug 5, 2021, 8:42 PM IST

మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్.. జులై28న తన 35వ బర్త్​డేను పురస్కరించుకుని రూ. 2.45 కోట్ల విలువైన మెర్సిడెస్ ఏఎంజీ జీ 63 అనే మోడల్​కారును కొనుగోలు చేశాడు. కొచ్చిలోని దుల్కర్​ ఇంటికే కారును డెలివరీ చేసింది కంపెనీ యాజమాన్యం. ఆ చిత్రాలు నెట్టింట వైరల్ అయ్యాయి.

మెర్సిడెస్​ కారును అందిస్తూ..

మెర్సిడెస్ ఏఎంజీ..

తెల్ల టీషర్ట్, ఆకుపచ్చ ట్రౌజర్స్​ ధరించి.. మెర్సెడెస్​ కంపెనీ ప్రతినిధి నుంచి కారుకు సంబంధించిన బాక్స్​ను తీసుకుంటున్నట్లు ఈ చిత్రంలో ఉంది. దుల్కర్​.. ఒలీవ్ గ్రీన్​ కలర్​తో పాటు బ్లూ- బ్లాక్ డుయల్ షేడ్​ ఉన్న కారును కొనుగోలు చేసినట్లు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

మెర్సెడెస్​ కారు

మలయాళ సూపర్​స్టార్ మమ్ముట్టి, అతని కుమారుడు దుల్కర్ సల్మాన్​కు కార్లంటే తెగ ఇష్టం. మమ్ముట్టి.. 369 రేంజ్ కార్లను గతంలో కొనుగోలు చేశాడు. దుల్కర్ కూడా ఇప్పటికే ఫెరారీ, బీఎండబ్ల్యూ, పోషె, మెర్సెడెస్ మోడల్స్​లో కార్లను కొనుగోలు చేశాడు.

మెర్సెడెస్​ కారు

దుల్కర్ ప్రస్తుతం.. తెలుగు దర్శకుడు హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్​ సంస్థ నిర్మిస్తోంది. సెల్యూట్ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దుల్కర్ పోలీస్​గా కనిపించనున్నాడు. రోషన్ ఆండ్రూస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాక 'ఓతిరమ్ కడకమ్' అనే యాక్షన్ సినిమాలోనూ దుల్కర్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సౌబిన్ షాహిర్ దర్శకుడు.

ఇదీ చదవండి:నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ కేసు రాజీ

ABOUT THE AUTHOR

...view details