తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అన్నాచెల్లెళ్లుగా కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్​! - sequel

దోస్తానా-2లో కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ అన్నా చెల్లెళ్లుగా నటించనున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో ఇద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమించే పాత్రలను పోషిస్తున్నారు.

కార్తీక్ ఆర్యన్ - జాన్వీ కపూర్

By

Published : Jul 11, 2019, 9:25 AM IST

2008లో బాలీవుడ్​లో సూపర్ హిట్టయిన చిత్రం దోస్తానా. ఈ సినిమాకు సీక్వెల్​గా దోస్తానా -2 రాబోతుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సినిమాలో వీరిద్దరూ ప్రేమికులు కాదంట.. అన్నాచెల్లెళ్లుగా నటించనున్నట్టు సమాచారం.

అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనేదే చిత్ర కథాంశం. ఆ పాత్ర కోసం కొత్త నటుడిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారంట కరణ్.

కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ నటిస్తున్నారంటే వీరిద్దరి మధ్య రొమాన్స్ ఉంటుందని మొదట అనుకున్నారు. అయితే దోస్తానా-2లో కొత్త అన్నా చెల్లెళ్ల జంటను పరిచయం చేస్తున్నాడు కరణ్​.

ఇది చదవండి: 'జడ్జిమెంట్'​ జర్నలిస్ట్​ వైపే... బాయ్​కాట్ కొనసాగింపు

ABOUT THE AUTHOR

...view details