దీపికా పదుకొణె ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. నిత్యం వర్కౌట్లు చేస్తూ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ కనబరిచే దీపిక.. వ్యాయమ శిక్షకురాలిగా తెరపై కనిపిస్తే పాత్రకు న్యాయం చేసినట్టే అవుతుందనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
ఫిట్నెస్ ట్రైనర్‌గా దీపికా పదుకొణె
తన కొత్త సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు దీపికా పదుకొణె సిద్ధమవుతోంది. అనన్యకు అక్కగా నటించడం సహా వ్యాయామ శిక్షకురాలిగానూ సందడి చేయనుంది.
దీపికా పదుకొణె
శకున్ బత్రా దర్శకత్వంలో ఆమె ఓ చిత్రంలో నటిస్తోంది. సిద్ధాంత్ చతుర్వేది, అనన్యాపాండే ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. "ఫిట్‌నెస్‌పై శ్రద్ధ కనపరిచే అమ్మాయిగా, ఓ ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా నటిస్తోంది" అని చిత్ర వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపిక, అనన్య అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారట.