Deepika padukone on Gehraiyaan: 'గెహ్రాహియా' చిత్రం నటిగా తనకు సంతృప్తిని, కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పింది బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణె. ఈ చిత్రంలో దీపిక నటనకు మిశ్రమ స్పందనులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఆధునిక సంబంధాలపైన షకున్ బత్రా దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.
"నిజానికి చెప్పాలంటే 'ఈ రోజు గుర్తుండిపోయే సన్నివేశంలో నటిస్తాం' అని ఏ నటులు ఆలోచించరు. ఆ సన్నివేశానికి తగ్గట్టుగా మా శక్తి మేర నటిస్తాం. ఓ నటిగా ప్రతిరోజు ఒకేలా ఉండదనే విషయాన్ని మరిచిపోకూడదు. ఒక్కోసారి బాధలో ఉన్నా ఉత్సాహవంతమైన సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. మరోరోజు ఉత్సాహంగా ఉన్నా దానికి విరుద్ధంగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఒక నటి కర్తవ్యం. నేను ప్రతిరోజూ వర్తమాన పరిస్థితుల గురించే ఆలోచిస్తాను. ఈ రోజు నేను ఒక ఐకానిక్ సన్నివేశంలో నటించడానికి వెళ్తున్నాను అని అనుకోను. నా సినిమా విడుదలైన రోజు కృతజ్ఞత భావంతో ఉంటాను. ఈ చిత్రం నాకు చాలా నేర్పించింది. కొత్త అనుభూతినిచ్చింది."