తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దక్షిణాది చిత్రాలను రీమేక్ చేయడమంటే ఇష్టం'

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్​ ఖాన్​ హీరోగా తెరకెక్కిన చిత్రం 'దబాంగ్​ 3'. ఇటీవల చెన్నైలో సినిమా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు సల్మాన్ ఖాన్.

dabang 3 movie team press meet at chennai
'నా తర్వాత సినిమా కూడా ప్రభుదేవాతోనే'

By

Published : Dec 18, 2019, 11:14 AM IST

బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ఖాన్​ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'దబాంగ్​ 3'. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కథానాయిక. కన్నడ స్టార్​ సుదీప్​ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. తాజాగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ముచ్చటించిన సల్మాన్​.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

"నేను నటించిన వాంటెడ్‌ చిత్రీకరణ నెలరోజుల పాటు చెన్నైలోనే జరిగింది.'విక్రమ్'​ హీరోగా తెరకెక్కిన 'సేతు' రీమేక్‌లో నటించా. దక్షిణాది చిత్రాల రీమేక్‌లో నటించాలంటే నాకు చాలా ఇష్టం. నటుడిగా మారడానికి ముందు ఓ ప్రకటన కోసం చెన్నై వచ్చా. ఇక్కడ నాకు మరిచిపోలేని అనుభూతి ఉంది. ప్రభుదేవా నాకు మంచి మిత్రుడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. శ్రమించే గుణం ఎక్కువ. అందువల్లే ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం చేస్తే బాగుంటుందని అనుకున్నా."

-సల్మాన్​ఖాన్​, సినీ నటుడు

తదుపరి సినిమాను కూడా ప్రభుదేవా దర్శకత్వంలో నటిస్తున్నట్లు సల్మాన్ చెప్పాడు. అనంతరం ప్రభుదేవా చిత్ర విశేషాలు తెలియజేశాడు.

దబాంగ్​ 3 చిత్రబృందం

"ఈ చిత్రానికి మీరే దర్శకత్వం వహించాలని సల్మాన్‌ ఆహ్వానించడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఆరంభంలోనే ఈ సినిమాను నాలుగు భాషల్లో తెరకెక్కించాలని అనుకున్నాం. అన్ని భాషల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

-ప్రభుదేవా, సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్​

ఇటీవల విడుదలైన 'దబాంగ్​ 3' ట్రైలర్​ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. ఈ నెల 20న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఇదీ చూడండి:వెండితెర మాంత్రికుడు.. సాంకేతికతకు ఆద్యుడు

ABOUT THE AUTHOR

...view details