ప్రముఖ కథానాయిక సోనాక్షి సిన్హా సినిమాల్లోకి రాకముందు తన శరీరాకృతి పట్ల ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తొలి చిత్రమే కండలవీరుడు సల్మాన్‌తో సినిమా చేసే అవకాశం రావడం వల్ల ఆ సినిమా కోసం బాగా కసరత్తులు చేసి 30 కిలోలు తగ్గినట్లు చెప్పుకొచ్చింది.
"చిత్ర పరిశ్రమకు రాకముందు 95 కిలోలు ఉండేదాన్ని. నా తొలి చిత్రం దబాంగ్ కోసం 30 కిలోలు తగ్గాను. నా పాఠశాల, కాలేజీ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో సరైన అవకాశాలు దక్కేవి కావు. దానికి కారణం లావుగా ఉండటమే. సినిమాల్లోకి వచ్చాక కొద్దిమంది ఈ విషయంపై కామెంట్లు చేసేవాళ్లు. ఇంత బరువు తగ్గినా తెరపై బొద్దుగానే కనిపిస్తాను. నేను నాజుగ్గా ఉండననే విషయం నాకు తెలుసు. అయినా నేనేమి పెద్దగా బాధపడను."
-- సోనాక్షి సిన్హా, సినీ నటి