తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Sonu Sood: అనాథ పిల్లలకు శాశ్వత పరిష్కారం కావాలి! - సూద్​ ఫౌండేషన్​

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఏదైన శాశ్వత పరిష్కారం కనుగొనాలని నటుడు సోనూసూద్​(Sonu Sood) అభిప్రాయపడ్డారు. అలాంటి చిన్నారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. అలానే కొవిడ్​తో కుటుంబపెద్దలను కోల్పోయిన అనాథలకు చేసే ప్రత్యామ్నాయాలను ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

covid-19 orphans we need to find a more permanent financial solution to the crisis, Says Sonu Sood
Sonu Sood: అనాథ పిల్లలకు శాశ్వత పరిష్కారం కావాలి!

By

Published : May 31, 2021, 10:12 PM IST

కరోనా సంక్షోభంలో వలస కార్మికుల నుంచి అన్ని వర్గాల ప్రజలకు సహాయం చేస్తూ ఆదుకుంటున్నారు నటుడు సోనూసూద్(Sonu Sood). ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా రెండోదశలోనూ సాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నాడు. అయితే కొవిడ్​తో తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథ పిల్లల కోసం ఆర్థికంగా ఏదైనా శాశ్వత పరిష్కారం కనుగొనాలని అంటున్నాడు.

"ఇప్పుడున్న పరిస్థితి గురించి నాకు తెలుసు. ఇది చాలా తీవ్రమైనది. ఎంతోమంది తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో సన్నిహితంగా ఉన్నాను. ఆ బాధేంటో నాకు తెలుసు. కొవిడ్‌తో కన్నవారిని పోగొట్టుకొని అనాథలైన పిల్లల కోసం, అలాగే కుటుంబాన్ని పోషించే వ్యక్తి దూరమైనవాళ్లకోసం శాశ్వతంగా పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపం చేశా. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగానే స్పందించడం సంతోషంగా ఉంది. ఇప్పటికే 11, 12 రాష్ట్రాలు బాధిత పిల్లలకు ఉచిత విద్యను ప్రకటించాయి. కొంత పెన్షన్‌ ప్రకటించాయి. అయితే ఈ విషయంలో ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. కొవిడ్‌ అనాథలకు ఉపయోగపడే ప్రయత్నాలన్నిటినీ ఒకే తాటిపైకి తేవాలి. ఈ సంక్షోభానికి ఏదైనా శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక పరిష్కారం కనుగొనాలి. ఈ పరిహారం, పెన్షన్‌ను ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు మాత్రమే కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో చదివేవారికి కూడా అందించాలి. ఎందుకంటే అనాథ పిల్లలు ఎక్కడున్నా వారి పరిస్థితులు ఒకేలాగే ఉంటాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను మాత్రమే ఎందుకు చూడాలి? ప్రతి పాఠశాలలోని పిల్లలకు సమాన శ్రద్ధ, పరిహారం ఇవ్వడం అనేదాన్ని సమర్థవంతంగా, కచ్చితంగా అమలు చేయాలి. ప్రస్తుతం మేం ఈ విధంగా ప్రభావితమైన పిల్లలందరికీ సంబంధించిన డేటా సేకరించడానికి ప్రయత్నిస్తున్నాం."

- సోనూసూద్​, నటుడు

దేశంలోని ప్రతిపౌరుడూ వ్యక్తిగతంగా తమ స్థాయిలో ఎంతోకొంత ఇతరులకు సాయం చేస్తే బాగుంటుందని సోనూ భావించారు. ఆర్థికంగా భరించగలిగే కుటుంబాలు.. కొవిడ్ అనాథపిల్లలను దత్తత తీసుకోవాలని సోనూసూద్​ సూచించారు.

ఇదీ చూడండి:sonu sood: ఒకప్పుడు తిరస్కరణ.. ఇప్పుడు ప్రశంసలు!

ABOUT THE AUTHOR

...view details