తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే సెలిబ్రిటీ అవ్వాలనుకున్నా: చంటి - actress ooha latest news

సెలిబ్రిటీగా మారాలని చాలా మందికి ఉంటుంది. కానీ, కొందరు మాత్రమే ఆ వైపుగా అడుగులు వేసి సక్సెస్​ అవుతారు. అలాంటి వారిలో ఒకరు చలాకీ చంటి. 'జబర్దస్త్​'తో ప్రేక్షకులకు చేరువైన ఈ కమెడియన్​.. నటి​ హిమజతో కలిసి 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యాడు. తాను ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి గల కారణమేంటో ఆలీతో పంచుకున్నాడు.

comedian chalaki chanti said by taking actress ooha as an inspirataion and then a beacame a celebrity
'ఊహాను చూసే.. సెలబ్రెటీగా మారాలని అనుకున్నా'

By

Published : Nov 11, 2020, 2:40 PM IST

బుల్లితెరపై మంచిపేరు సంపాదించుకుంది నటి హిమజ. 'జబర్దస్త్'​ వేదికగా హాస్యనటుడిగా ప్రేక్షకాదరణ పొందాడు చలాకీ చంటి. వీరిద్దరూ ఇటీవల 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'సెలిబ్రిటీ అవ్వడానికి గల కారణమేంటి' అని చంటిని ప్రశ్నించాడు ఆలీ. దానికి కారణం 'సినీ నటి ఊహా' అని సమాధానమిచ్చాడు చంటి.

"నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో.. కల్చరల్​ ప్రెసిడెంట్​(సాంస్కృతిక అధ్యక్షుడు)గా ఉండేవాడిని. ఆ సమయంలో పెత్తనమంతా నా చేతుల మీదుగానే నడిచేది. అప్పుడు నేను తొమ్మిదో తరగతిలో ఉంటే.. నాకంటే పెద్దవాళ్లైన పదో తరగతి విద్యార్థులను బెదిరించేవాడిని. దానివల్ల అందరూ నాకు గౌరవం ఇచ్చేవారు. కానీ, ఓరోజు పాఠశాల వార్షికోత్సవానికి ఊహా గారు మా బడికి వచ్చారు. అప్పుడు అందరూ ఊహాను చూడాలనే ఆత్రుతతో నన్ను తీసిపారేశారు. నన్ను గౌరవించలేదు. అప్పుడే అనుకున్నా. మనం ఒక స్టేజ్​కు వస్తేనేగానీ, మనకు ఓ స్టేజ్​ ఉండదని. అందుకోసమే సెలిబ్రిటీ అవ్వాలని అనుకున్నా."

-చలాకీ చంటి.

తన విద్యాభ్యాసమంతా హైదరాబాద్​లోనే సాగిందని తెలిపాడు చంటి. తన తండ్రి ఒకప్పుడు అగరుబత్తుల వ్యాపారం చేసేవాడని చెప్పాడు.

ఇదీ చూడండి:'పగవాడికైనా ఇలాంటి పరిస్థితి రాకూడదు'

ABOUT THE AUTHOR

...view details