తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎస్వీఆర్ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం'

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో అలనాటి నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించాడు మెగాస్టార్ చిరంజీవి. ఎస్వీఆర్ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని కీర్తించాడు.

చిరంజీవి

By

Published : Oct 6, 2019, 5:43 PM IST

Updated : Oct 6, 2019, 6:43 PM IST

మెగాస్టార్ చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లాలో సందడి చేశాడు. తాడేపల్లిగూడెంలో అలనాటి నటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. అభిమానుల సమక్షంలో ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన... తర్వాత నిర్వహించిన సభలో ప్రసంగించాడు.

"నేను అభిమానించే నటుడు ఎస్వీఆర్. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా. గతేడాదే ఈ కార్యక్రమం గురించి నా దగ్గరకు ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పుడు సైరా షూటింగ్​లో బిజీగా ఉండడం వల్ల పరిస్థితులు అనుకూలించలేదు" - చిరంజీవి

ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

ఎస్వీఆర్ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని అన్నాడు మెగాస్టార్​.

"నేను అభిమానించే నటీనటులు ఎవరని అడిగితే.. తడుముకోకుండా ఎస్వీఆర్, మహానటి సావిత్రి పేర్లు చెబుతాను. అలాంటి మహానటులు గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఎస్వీఆర్ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. ఇక్కడ ఆయన విగ్రహం పెట్టడం ఆనందదాయకం" - చిరంజీవి

వేదికపై ప్రసంగిస్తున్న మెగాస్టార్

తను నటించిన సైరా చిత్రాన్ని విజయవంతం చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్యెల్యే కొట్టు సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు

ఇదీ చదవండి: దుర్గాష్టమి వేడుకల్లో అమితాబ్​, కాజోల్​ సందడి

Last Updated : Oct 6, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details