తారలు కెమెరా ముందుకొచ్చే వేళ ఇది. రెండో దశ కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల.. ఇదివరకు ఆగిపోయిన సినిమాలన్నీ మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. అగ్ర హీరో చిరంజీవి తాను నటిస్తున్న 'ఆచార్య'(Acharya) కోసం బుధవారం సెట్లోకి అడుగు పెట్టారు. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో సన్నివేశాల్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే తుదిదశకు చేరుకున్నా.. కరోనా కారణంగా ఆగిపోయింది.
ప్రస్తుతం ఏకధాటిగా సాగే ఈ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం రంగంలోకి దిగింది. రెండు రోజుల ప్యాచ్ వర్క్ కోసం రామ్ చరణ్(Ram Charan) తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాలోని రెండో లిరికల్ గీతానికి సంబంధించి ఓ ప్రకటన వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చరణ్, పూజాలపై చిత్రీకరించిన పాటను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.