బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై వచ్చిన మీటూ ఆరోపణలపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి, అతడికి మద్దతుగా నిలిచారు. తనపై గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ, నటి పాయల్ ఘోష్.. అనురాగ్‌పై శనివారం ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఈ ఆరోపణలను కశ్యప్ ఖండించారు.
'మీటూ' ఆరోపణలు.. అనురాగ్‌కు మద్దతుగా సెలబ్రిటీలు
దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్.. శనివారం ట్విట్టర్ వేదికగా మీటూ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు అతడికి మద్ధతుగా నిలిచారు. ఇవి నిరాధార ఆరోపణలు అని అన్నారు.
అనురాగ్ కశ్యప్
దర్శకుడు అనుభవ్ సిన్హా అనురాగ్‌కు మద్దతు తెలుపుతూ ఆదివారం ట్వీట్ చేశారు. మీటూ ఉద్యమం ముఖ్య ఉద్దేశం వేధింపులకు గురైన మహిళల గొంతును వినిపించడానికేనని.. దానిని దుర్వినియోగపరిచేందుకు కాదని అన్నారు. అవకాశాల కోసమే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తుంటారని నటి సుర్వీన్ చావ్లా పేర్కొంది. 'సేక్రడ్ గేమ్స్' వెబ్‌సిరీస్ కోసం అనురాగ్‌తో కలిసి ఈమె పనిచేసింది.
మరోవైపు ప్రతిభను మాత్రనే చూసి వారికి మద్దతుగా నిలబడే వ్యక్తుల్లో కశ్యప్ ఒకరని నటి టిస్కా చోప్రా పేర్కొంది.