తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తారల పాలిట శాపంగా మారిన కరోనా!

కరోనా కారణంగా పలువురు సెలబ్రిటీల కుటుంబాల్లో విషాదం నెలకొంది. వారికి సంబంధించిన వ్యక్తుల్ని కొవిడ్-19 పొట్టన పెట్టుకుంది. ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన సెలబ్రిటీ కుటుంబీకులు ఎవరో చూద్దాం.

Celebs who have lost family members due to Corona
తారల పాలిట శాపంగా మారిన కరోనా!

By

Published : May 6, 2021, 9:32 AM IST

కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. సామాన్య ప్రజలు, ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. ఆక్సిజన్ అందక, సరైన వైద్యసదుపాయాలు లేక చాలామంది తనువు చాలిస్తున్నారు. పలువురు సెలబ్రిటీస్​ కుటుంబంలోనూ కొవిడ్-19 విషాదం నింపింది. వారి కుటుంబంలోని వ్యక్తులను బలితీసుకుంది. బాలీవుడే కాక్ దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు కరోనా కారణంగా మృతిచెందారు. వారెవరో చూద్దాం.

ప్రదీప్ మాచిరాజు నాన్న

టాలీవుడ్​కు చెందిన యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండురంగ మాచిరాజు కరోనా కారణంగా మే 1న మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రదీప్ టీమ్ మే 2న వెల్లడించింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంతో ఇటీవలే హీరోగా మెప్పించారు ప్రదీప్.

కుటుంబంతో ప్రదీప్

భూమీ పెడ్నేకర్ బంధువు

కరోనా వల్ల తాను ఇద్దరు వ్యక్తుల్ని కోల్పోయానని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది బాలీవుడ్ నటి భూమీ పెడ్నేకర్. కానీ వారెవరో తెలపలేదు.

బాబా సెగల్ తండ్రి

తన గాత్రంతో కుర్రకారను ఉర్రూతలూగించిన సింగర్ బాబా సెగల్ కుటుంబంలోనూ కరోనా విషాదం నింపింది. ఆయన తండ్రి కరనా కారణంగా మరణించారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

తండ్రితో బాబా సెగల్

నిక్కీ తంబోలీ సోదరుడు

తెలుగులో శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం'తో హీరోయిన్​గా పరిచయమైంది నిక్కీ తంబోలి. తన సోదరుడు వైరస్​ సోకి తుదిశ్వాస విడిచాడని సోషల్​మీడియా ద్వారా తెలుపుతూ భావోద్వేగానికి గురైంది. కాగా, ఇప్పటికే అతడికి పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు కూడా వెల్లడించింది. 'చీకటి గదిలో చితకొట్టుడు', 'కాంచన 3' సినిమాల్లో నటించింది నిక్కీ.

సోదరుడితో నిక్కీ తంబోలీ

పియా బాజ్​పేయ్ సోదరుడు

'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పియా బాజ్​పేయీ(ఉత్తరప్రదేశ్​). ఈమె సోదరుడు వెంటిలేటర్​ చికిత్స అందకపోవడం వల్ల చనిపోయాడు. ఈ విషయాన్ని సోషల్​మీడియా ద్వారా తెలిపింది బాయ్​పేయీ. తన సోదరుడికి అత్యవసరంగా వెంటిలేటర్​ సాయం కావాలని.. బెడ్​ దొరకడం లేదని సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకుందీ నటి. ఈ పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే అతడు చనిపోయాడంటూ భావోద్వేగానికి గురైంది.

పియా ట్వీట్

గౌరవ్ చోప్రా తల్లిదండ్రులు

పదిరోజుల వ్యవధిలోనే నటుడు గౌరవ్ చోప్రా తల్లిదండ్రులు కరోనాతో మృతిచెందారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్​స్టాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు గౌరవ్.

తల్లిదండ్రులతో గౌరవ్ చోప్రా

రిద్దిమా పండిట్ తల్లి

'బాహు హమారీ రజనీకాంత్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రిద్దిమా పండిట్ కరోనా కారణంగా తన తల్లిని పోగొట్టుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్​స్టాలో ఫొటోతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేసింది రిద్దిమా.

ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు బాధితులకు అండగా నిలుస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. సోనూసూద్ కరోనా ఫస్ట్ వేవ్ నుంచి తన సాయాన్ని కొనసాగిస్తుండగా.. ప్రియాంకా చోప్రా, భూమీ పెడ్నెకర్, ఆలియా భట్, అక్షర్ కుమార్, ట్వింకిల్ ఖన్నా తదితరులు వారికి తోచిన సాయం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details