విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఇటీవల విడుదలైన కాలేజీ క్యాంటీన్ సాంగ్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. రష్మిక మందణ్న హీరోయిన్గా నటించింది.
క్యాంటీన్ సాంగ్ వీడియోను సింగిల్ టేక్‌లో చిత్రీకరించినట్టు పాట విడుదలకు ముందే చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం మేకింగ్ వీడియోలో చూస్తే ఆ విషయం తెలుస్తోంది. రెహమాన్ సాహిత్యం అందించిన ఈ పాటను కార్తీక్ రోడ్రిగ్స్ ఆలపించాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చాడు.