తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బుట్టబొమ్మ' పాటను మర్చిపోలేకపోతున్న వార్నర్ - warner butta bomma news

బుట్టబొమ్మ పాట 450 మిలియన్ల వ్యూస్​ దాటిన సందర్భంగా ఇన్​స్టా స్టోరీస్​లో ఆ విషయాన్ని పంచుకున్నాడు వార్నర్. దీంతో అతడి అభిమానులతో పాటు బన్నీ ఫ్యాన్స్​ కూడా ఫుల్​ ఖుషీ అయిపోతున్నారు.

'butta bomma' song crosses 450 million views, cricketer warner insta post
వార్నర్ బుట్టబొమ్మ

By

Published : Nov 24, 2020, 10:51 AM IST

'అల వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' పాట, మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం 450 మిలియన్ల మార్క్​ను అధిగమించింది. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్ వార్నర్​.. వెల్​డన్ అల్లు అర్జున్ అని ఇన్​స్టాలో పోస్ట్ పెట్టాడు.

వార్నర్​ ఇన్​స్టా స్టోరీస్​లో 'బుట్టబొమ్మ'

వార్నర్​కు 'బుట్టబొమ్మ'తో ఏంటి సంబంధం?

లాక్​డౌన్​లో ఆటలన్నీ నిలిచిపోవడం వల్ల క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆ సమయంలో టిక్​టాక్​లు చేస్తూ అభిమానులకు దగ్గరయ్యాడు వార్నర్. ఈ క్రమంలోనే 'బుట్టబొమ్మ', 'మైండ్​బ్లాక్' లాంటి తెలుగు పాటలకు డ్యాన్స్​ వేసి టాలీవుడ్​ ఫ్యాన్స్​ కూడా చేరువయ్యాడు. ఇటీవల ఐపీఎల్​లో తమ జట్టు ఫైనల్​కు వెళ్తే 'బుట్టబొమ్మ'​ స్టెప్పు వేస్తానని వార్నర్​ ఓ నెటిజన్​ కామెంట్​కు రిప్లై ఇచ్చాడు. కానీ హైదరాబాద్​ జట్టు క్వాలిఫయర్​-2లో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో వార్నర్​ అభిమానులు నిరాశ చెందారు.

అయితే ఈ మధ్య అభిమానులతో చేసిన చాటింగ్​లో ఆసక్తికర విషయం పంచుకున్నాడు వార్నర్. వచ్చే ఏడాది ఐపీఎల్​లో కచ్చితంగా 'బుట్టబొమ్మ' గీతానికి డ్యాన్స్ వేస్తానని తెలిపాడు.

ఇది చదవండి:సన్​రైజర్స్ విజయం సాధిస్తే 'బుట్టబొమ్మ'కు డ్యాన్స్ చేస్తా

ABOUT THE AUTHOR

...view details