తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాటిల్ క్యాప్ ఛాలెంజ్ అప్పట్లోనే...

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' వైరల్​ అవుతోంది. కానీ... హాలీవుడ్ యాక్షన్ హీరో బ్రూస్​లీ ఈ ఛాలెంజ్​ను అప్పట్లోనే పూర్తి చేశాడని మీకు తెలుసా?

By

Published : Jul 7, 2019, 9:54 AM IST

బ్రూస్ లీ

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం 'బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌' హవా నడుస్తోంది. ఇటీవల బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్‌ దీన్ని పూర్తి చేసి, ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఆయన అభిమానులంతా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసే పనిలో పడ్డారు.

అయితే.. ఇప్పుడు మన మధ్య లేని హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో బ్రూస్‌లీ ఎప్పుడో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. అదీ కాలితోనో.. లేదా చేతితోనో కాదండోయ్‌ ఏకంగా నాన్‌చాక్‌తో! దాన్ని తిప్పుతూ మూడు బాటిళ్ల మూతలను తీసేశాడంటే నమ్మగలరా. కానీ, ఇది నిజం.

మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది మొదట బ్రూస్‌లీనే. ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ సొంతంగా స్టంట్స్‌ చేసేవాడు. ఇక నాన్‌చాక్‌ తిప్పితే ఆ వేగం కెమెరాకు కూడా అందేది కాదు. అలాంటి బ్రూస్‌లీ గాజు సీసాలపై ఉన్న మూతలను నాన్‌చాక్‌ ఉపయోగించి ఎప్పుడో తీసేశాడు. ఈ వీడియోను ఆయన కుమార్తె ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

ఇవీ చూడండి.. 'బింద్రా' బయోపిక్​లో హర్షవర్ధన్ కపూర్ లీడ్​రోల్​

ABOUT THE AUTHOR

...view details