బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ తల్లయింది. తాజాగా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం పాపకు జన్మనిచ్చిందని.. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని తన ప్రియుడు హర్ష్బెర్గ్ వెల్లడించినట్లు సమాచారం.
పెళ్లి కాకుండానే గర్భం.. ఇంట్లో ఏమన్నారంటే..!
దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో విడాకులు తీసుకున్న కల్కి... కొన్ని ఏళ్లుగా హర్ష్‌బర్గ్ అనే వ్యక్తితో కలిసి జీవిస్తోంది. ఇటీవల తను బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయాన్ని కల్కి తెలిపింది. కరీనా కపూర్ రేడియో కార్యక్రమంలో పాల్గొన్న ఈ నటి.. పెళ్లికి ముందే తల్లి కాబోతున్న వార్తను కుటుంబ సభ్యులు ఎలా స్వీకరించారని పశ్నించగా... ఇలా సమాధానం ఇచ్చింది.
" దర్శకుడు అనురాగ్ కశ్యప్, నేను మూడేళ్లు ప్రేమించుకుని 2011లో పెళ్లి చేసుకున్నాం. అయితే రెండేళ్లకు మించి మా వైవాహిక బంధం కొనసాగలేదు. మేమిద్దరం స్నేహపూర్వకంగానే విడిపోయాం. ఇప్పటికీ మా మధ్య స్నేహం అలాగే ఉంది. ప్రస్తుతం నేను హర్ష్‌బెర్గ్‌తో డేటింగ్ చేస్తున్నా. ఇటీవల గర్భవతినయ్యా. నేను గర్భవతినని తెలిసి బాలీవుడ్‌లో చాలా మంది హ్యాపీగా ఫీలయ్యారు. కానీ, నెటిజన్లు మాత్రం తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటని తిట్టారు. ఏవరేమి అనుకున్నా నేను, హర్ష్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం" అని కల్కి చెప్పింది.
2011లో అనురాగ్ కశ్యప్, కల్కి వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల 2013లో విడిపోయారు. 2015లో వీరికి అధికారికంగా విడాకులు లభించాయి. అయినా ఇప్పటికీ వీరిద్దరు స్నేహితుల్లానే కొనసాగుతున్నారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయేల్‌కు చెందిన వాద్యకారుడు హర్ష్‌బెర్గ్‌తో సహజీవనం చేస్తోంది. గతేడాది తమిళ చిత్రం నేర్కొండ పార్వైలోనూ చివరిగా వెండితెరపై కనిపించింది. 2019లో 'మేడ్ ఇన్ హెవెన్', 'సేక్రెడ్ గేమ్స్' వెబ్ సిరీస్‌ల్లోనూ సందడి చేసింది.
ఇదీ చూడండి...
నన్ను రష్యన్ వేశ్య అన్నారు: కల్కి కొచ్లిన్