Bheemla nayak new release date: ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల సంక్రాంతికి రావాల్సిన భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా పడ్డాయి. వాటిలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పటికే ప్రకటన వచ్చింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
అయితే 'రాధేశ్యామ్'ను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, త్వరలో రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తామని ఇటీవల ఆ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ స్పష్టం చేశారు. ఓ అభిమాని ట్వీట్‌కు సమధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మార్చి 4నే ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది సమాచారం.