Pawan kalyan bheemla nayak movie: 'భీమ్లా నాయక్' కొత్త అప్డేట్ వచ్చేసింది. 'భీమ్.. భీమ్.. భీమ్లా నాయక్' సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పడం సహా సినిమా విడుదల తేదీని కొన్నిరోజుల్లో వెల్లడిస్తామని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. పవన్ లేటేస్ట్ లుక్‌ను షేర్ చేశారు.
అయితే ఈ సినిమా సెన్సార్.. సోమవారం(ఫిబ్రవరి 14) జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది. ముందే చెప్పినట్లు ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి రావడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అంతలో ఏపీలోని 'సినీ' సమస్యలు పరిష్కారమయ్యేలా కనిపిస్తున్నాయి.