తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ టైమ్ ట్రావెల్ చిత్రాల్ని అస్సలు మిస్ కావొద్దు!

టైమ్ ట్రావెల్​ కాన్సెప్ట్​తో తెరకెక్కిన సినిమాలు చూశారా? కల్పితానికి చాలా అవకాశాలు ఉండి.. అర్థం చేసుకోవడానికి గజిబిజిగా చూసిన సన్నివేశాలే మళ్లీ.. మళ్లీ చూసినట్లు ఉంటాయి. కానీ ఈ తరహా స్టోరీతో ఉన్న సినిమాలను చూడకుండా ఉండలేం.. అలాంటి చిత్రాలపైనే ఈ కథనం.

time travel movies
ప్రేక్షకలోకం మెచ్చే టైమ్ ట్రావెల్ మూవీలు

By

Published : Jul 31, 2021, 7:47 PM IST

Updated : Jul 31, 2021, 8:21 PM IST

టైమ్ ట్రావెల్​ కాన్సెప్ట్​తో తెరకెక్కిన సినిమాలు చాలానే చూసి ఉంటాం. క్లిష్టమైన సిద్ధాంతాలతో కూడి ఉంటాయి. సైన్స్​ ఫిక్షన్ ప్రధానంగా ఉంటుంది. కల్పిత సీన్​లు ఎక్కువగా కనిపిస్తాయి. అయినప్పటికీ.. ప్రేక్షకున్ని సంతృప్తిపరిచే విధంగా సరిగ్గా తీసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాలపైనే ఈ కథనం.

ప్రైమర్..

ఇద్దరు స్నేహితులు కలిసి గతానికి వెళ్లే టైమ్​ మెషిన్​ను కనుగొంటారు. దానితో స్టాక్ మార్కెట్​లో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు. చివరికి ప్రణాళిక వికటిస్తుంది.

ప్రైమర్

ఎందుకు చూడాలంటే..

టైమ్​ ట్రావెల్​ సినిమాల్లో ఎవర్​గ్రీన్ ఇది. మొదటిసారి చూస్తే సరిగా అర్థం కాదు. కానీ యూట్యూబ్​లో 23 నిమిషాల యానిమేటెడ్​ మూవీ చూసిన తర్వాత అయితేనే అవన్నీ ఎలా పనిచేస్తాయి అనేదానిపై ఓ అవగాహన వస్తుంది. కాస్త.. నమ్మశక్యంగా ఉండదు. ఈ చిత్ర డైరెక్టర్ కూడా సులభంగా తీయడానికి నిరాకరించారు. కానీ టైమ్​ ట్రావెల్​ మూవీలు ఇష్టమైతే.. ఇది తప్పక చూడాల్సిందే.

ద బటర్ ఫ్లై ఎఫెక్ట్..

ఓ వ్యక్తి టైమ్ ట్రావెల్​ను ఉపయోగించి తన చిన్ననాటి నుంచి భవిష్యత్​ను, గతాన్ని చూస్తాడు.

బట్టర్ ఫ్లై ఎఫెక్ట్

ఎందుకు చూడాలంటే..

2004 ఏడాది టైమ్ ట్రావెల్​ సినిమాలకు అతి గొప్ప సమయం. ఈ కాలంలో ప్రైమర్​, బటర్ ఫ్లై సినిమాలు రెండీ రిలీజ్​ అయ్యాయి. బటర్​ ఫ్లై సినిమా మొదట విమర్శలకు లోనైంది. ఎందుకంటే ఇతర టైమ్ ట్రావెల్​ సినిమాల కన్నా ఇది విభిన్నం. కానీ తర్వాత ప్రేక్షకామోదం పొందింది. ఆ రోజుల్లో 81 శాతం మంది ఈ సినిమాకు అనుకూలంగా రేటింగ్ ఇచ్చారు. తప్పక చూడాల్సిన టైమ్ ట్రావెల్ సినిమా.

హ్యాపీ డెత్​ డే..

ఓ యూనివర్సిటీ స్టుడెంట్​ని ఆయన పుట్టిన రోజే మర్డర్​ చేస్తాడో దుండగుడు. అదే రోజున మళ్లీ.. మళ్లీ జన్మిస్తాడు ఆ కుర్రాడు.

ఎందుకు చూడాలంటే..

టైమ్​ ట్రావెల్​ సినిమాల్లో సైన్స్​ ఫిక్షన్ అధికంగా ఉన్న సినిమా ఇది. అక్కడక్కడా కామెడీ అలరిస్తుంది. బేబీ మాస్క్​ ధరించడం, ప్రతిచోట కిల్లర్​ ఉండడం, మిస్టరీ, ప్రధాన పాత్రదారుడు చేసే ప్రయాణం చూడదగింది.

ఇంటర్​స్టెల్లార్..

ఈ సినిమాలో జీవించడానికి ఇంకో గ్రహాన్ని కనుగొనే ప్రయత్నంలో బ్లాక్ హోల్​ గుండా ప్రయాణం చేస్తారు వ్యోమగాములు.

ఎందుకు చూడాలంటే..

ఇది అంతరిక్ష ప్రయాణంతో కూడిన సైన్స్ ఫిక్షన్ సినిమా. దీనికి టైమ్​ ట్రావెల్​ను యాడ్​ చేసి.. అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. సైంటిఫిక్​గా కాస్త డీప్​గా ఉంటుంది. అలాగే.. టైమ్ ట్రావెల్​లో ఉత్తమ సినిమా ఇది.

ది టర్మినేటర్​..

భవిష్యత్​లో ఓ వ్యక్తిని రక్షించే తల్లిని చంపడానికి ఈ సినిమాలో ఓ రోబోని గతానికి పంపిస్తారు.

ది టర్మినేటర్

ఎందుకు చూడాలంటే..

మీరు ఈ క్లాసిక్ మూవీని చూసే ఉంటారు. ఒకవేళ చూడలేకపోతే తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఇందులో రోబోలతో పాటు టైమ్ ట్రావెల్​ గురించి ఉంటుంది. ఎలాంటి భావోద్వేగాలు లేని రోబో గోడలను ఎలాగైతే పగులకొడుతుందో మనుషులతోనూ అలాగే ఫైట్​ చేస్తుంది. అలాంటి రోబో టైమ్ ట్రావెల్ సినిమాను తప్పక చూడండి.

బ్యాక్​ టూ ఫ్యూచర్​

టైమ్ మెషిన్​ని ఉపయోగించి ఓ టీనేజర్​తో కలిసి ఓ శాస్త్రవేత్త 30 ఏళ్ల వెనక్కి వెళ్తాడు.

బ్యాక్​ టు ఫ్యూచర్​

ఎందుకు చూడాలంటే..

టైమ్ ట్రావెల్​ మూవీల్లో ఇది ఎవర్​గ్రీన్. ఎంటర్​టైన్​మెంట్​, ప్రధాన పాత్రదారుడి టైమ్​ ట్రావెల్​ ప్రయాణం, యుక్త వయస్కులైన తల్లిదండ్రులతో మాట్లాడడం అద్భుతంగా ఉంటుంది. మూవీ పార్ట్ 2లో భవిష్యత్​లోకి వెళ్లడం ఉంటుంది. టైమ్​ట్రావెల్​లో చూడాల్సిన చిత్రమిది.

ఎబౌట్ టైమ్..

ఓ కుటుంబంలో తండ్రి, కూతురు టైమ్​ ట్రావెల్ చేస్తారు ఈ సినిమాలో.

ఎబౌట్ టైమ్​

ఎందుకు చూడాలంటే..

రొమాంటిక్ ట్విస్ట్​తో కూడిన మూవీ ఇది. ప్రధాన పాత్రదారుడు తన సోదరి స్నేహితురాలిని ప్రేమిస్తాడు. టైమ్ ట్రావెల్​ తర్వాత వెనుకకు రాలేకపోతాడు. ప్రేయసి అతన్ని మర్చిపోతుంది. మళ్లీ తెలుసుకుని టైమ్ ట్రావెల్​ చేయగలిగే నాటికి తన ప్రేమను వ్యక్తపరచలేడు. టైమ్ ట్రావెల్​లో తప్పక చూడాల్సిన చిత్రమిది.

12 మంకీస్​

2035 నుంచి 90ల్లోని ప్రాణాంతక వైరస్​ను హతమార్చడానికి ఓ వ్యక్తి టైమ్ ట్రావెల్​ చేస్తాడు.

12 మంకీస్​

ఎందుకు చూడాలంటే..

లక్ష్య ఛేదన దిశగా సాగే ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. సినిమాలో టైమ్ ట్రావెల్​ సీన్​లు చాలా ఉంటాయి. ట్విస్ట్​లు అంతగా కనిపించవు. కానీ టైమ్​ట్రావెల్ మూవీ చూడాలనుకుంటే దీనిని తప్పక చూడాలి. సినిమా అనంతరం ఆలోచింపజేసే విధంగా ఎండ్​ ఉంటుంది.

డొన్నీ డార్కో​..

ఈ సినిమాలో తన ఇంటి పైకప్పును ఓ జెట్ ఇంజిన్ ఢీకొట్టిన తర్వాత ఓ టీనేజర్​కు పీడకలలు వస్తుంటాయి.

డొన్నీ డార్కో

ఎందుకు చూడాలంటే..

డొన్నీ డార్క్​ అద్భుతమైన టైమ్​ ట్రావెల్​ సినిమా. మిస్టరీ, కామెడీ, ఆందోళన, అన్నీ కలగలిసిన చిత్రమిది. టైమ్ ట్రావెల్​లో కొన్ని విషయాలు అంత తేలిగ్గా అర్థం కావు. కానీ చివరి వరకు సందేహాలన్నీ తీరిపోతాయి. టైమ్ ట్రావెల్ సినిమా మళ్లీ చూడాలనుకుంటే తప్పక వీక్షించాల్సిన చిత్రమిది.

ఇదీ చదవండి:రణ్​వీర్​ నయా లుక్..​ నెట్టింట హాట్​ టాపిక్​

Last Updated : Jul 31, 2021, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details