సాహో చిత్రం విడుదలకు ముందే రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సినిమాలోని బ్యాడ్‌బాయ్ సాంగ్‌ను ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని హిందీ పాట యూట్యూబ్‌లో సంచలనం రేపుతోంది. 24 గంటల్లోనే 85 లక్షలకుపైగా వీక్షణలతో రికార్డు అందుకుంది. ప్రస్తుతం 12 లక్షలకుపైగా ఈ వీడియోను చూశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగుతూ ట్రెండింగ్‌గా మారింది.
ప్రభాస్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించిన ఈ పాట శోతల్ని అలరిస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటోంది. స్టైలిష్ స్టెప్పులతో డార్లింగ్ కిక్ ఎక్కించాడు. జాక్వలిన్ తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది. తెలుగులో ఈ పాటను 50 లక్షల మందికిపైగా చూశారు.