'అమెరికా పోయి నువ్వు అవుతావురా', 'నీ కన్నులు నా దిల్లులోన నాటుకున్నాయే'.. ఇలా తన స్వరంతో హుషారెత్తించిన రాహుల్ సిప్లిగంజ్ మరో పాటతో అలరిస్తున్నాడు. ఈసారి 'అయిగిరి నందిని.. నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే' స్తోత్రాన్ని తనదైన శైలిలో ఆలపించి ఔరా అనిపిస్తున్నాడు. 'యురేక' చిత్రంలోని గీతమిది.
రాహుల్ స్వరం నుంచి 'అయిగిరి నందిని'
కార్తీక్ ఆనంద్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'యురేక'. తాజాగా ఈ సినిమాలోని అయిగిరి నందిని అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం.
కార్తీక్ ఆనంద్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. షాలినీ, డింపుల్, మున్నా, అపూర్వ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై లలిత కుమారి, ప్రశాంత్ తాత సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా 'అయిగిరి నందిని' పాటను చిత్రబృందం విడుదల చేసింది.
"గాలే గీత గీస్తే ఆగదే.. నీడే ముసుగేస్తే దాగదే.. సత్యమే చెరిపేస్తే స్వప్నమై మారిపోదే" అంటూ సాగే ఈ గీతంలో అయిగిరి నందిని స్తోత్రం కలిపి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు రచయిత రామాంజనేయులు. "గాలి దాడిలోన దీపమారే, దేహమైన మట్టిచేయు ద్వేషం ఎందుకోసం" వంటి చరణాలు ఆలోచింపజేస్తున్నాయి. సాహిత్యం, ఈ వీడియోలో చూపించిన కొన్ని సన్నివేశాలను బట్టి చూస్తుంటే కథలో భాగంగా వచ్చే పాట అనిపిస్తుంది. నరేశ్ కుమరన్ సంగీతం ఉద్వేగ భరితంగా సాగుతూ పాటను మరోస్థాయికి తీసుకెళ్లింది.