తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సరికొత్తగా 'అవతార్' అద్భుత ప్రపంచం

హాలీవుడ్ అద్భుత చిత్రం 'అవతార్' స్వీక్వెల్స్​కు సంబంధించిన కొన్ని ఫొటోలను చిత్రబృందం ట్విట్టర్​లో పంచుకుంది. ఇవి చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

'అవతార్' స్వీక్వెల్స్​కు సంబంధించిన కొన్ని ఫొటోలు
సరికొత్తగా 'అవతార్' అద్భుత ప్రపంచం

By

Published : Jan 7, 2020, 9:56 PM IST

హాలీవుడ్​ స్టార్ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ తీసిన అద్భుత దృశ్యకావ్యం 'అవతార్'. 2009లో వచ్చిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టింది(అవెంజర్స్: ఎండ్​గేమ్ విడుదల ముందువరకూ). కొనసాగింపుగా 'అవతార్ 2', 'అవతార్ 3', 'అవతార్ 4', 'అవతార్ 5' రూపొందుతున్నాయి. వీటికి సంబంధించిన కొత్త ఫొటోలను ట్విట్టర్​లో మంగళవారం పంచుకుంది చిత్రబృందం. సరికొత్త 'పండోరా' గ్రహం ఇదేనంటూ చెప్పింది.

సరికొత్తగా 'అవతార్' అద్భుత ప్రపంచం

"అవతార్' స్వీకెల్స్​లో మీరు పండోరా గ్రహాన్ని చూడలేరు. సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. రాబోయే 'అవతార్' ప్రపంచం కాన్సెప్ట్ ఆర్ట్ ఫొటోలు మీకోసం" -ట్విట్టర్​లో అవతార్ యూనిట్

'అవతార్ 2', 'అవతార్ 3'... ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. వరుసగా వచ్చే డిసెంబరు 18, 2023 డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవి విజయవంతమైతే మిగిలిన రెండు భాగాల్ని పూర్తి చేస్తానని కామెరూన్ ప్రకటించాడు. ఈ సీక్వెల్స్ బడ్జెట్​ ఒక బిలియన్ డాలర కన్నా ఎక్కువ. ఇందులో శామ్ వర్తింగ్టన్, జోయా సల్డానా, కేట్ విన్స్​లెట్, జోయల్ డేవిడ్ మోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సరికొత్తగా 'అవతార్' అద్భుత ప్రపంచం
సరికొత్తగా 'అవతార్' అద్భుత ప్రపంచం

ABOUT THE AUTHOR

...view details