భారీ అంచనాలతో యంగ్రెబల్స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'. శ్రద్ధా కపూర్ కథానాయిక. సుజీత్ దర్శకుడు. ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముందుగా చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నా... పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కావడం వల్ల 30కి వాయిదా పడింది. సినిమాపై అభిమానులు నిరాశపడకుండా ఎప్పటికప్పుడు పోస్టర్లు, పాట ప్రోమోలు విడుదల చేస్తోంది చిత్రబృందం. ఈ నెల 10న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
ఆగస్ట్ 10న ట్రైలర్‌తో వస్తున్న సాహో - sahoo movie trailer
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం నుంచి కొత్త అప్డేట్. ఈ నెల 10న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. ఇప్పటికే పోస్టర్లు, టీజర్, సాంగ్ ప్రోమోలతో అభిమానుల్లో ఫుల్‌జోష్ పెంచేసింది.

ఆగస్ట్10న ట్రైలర్‌తో వస్తున్న సాహో
త్వరలో రామోజీ ఫిల్మ్‌సిటీలో ముందస్తు విడుదల వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలూ చేస్తున్నారట నిర్మాతలు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే సినిమాలోని ముగ్గురు నటుల తొలిరూపులను పరిచయం చేసింది చిత్రయూనిట్. అవతార్‌గా నీల్ నితిన్ ముఖేష్, విశ్వాంక్‌గా అరుణ్ విజయ్, దేవరాజ్‌గా చుంకీ పాండే నటిస్తున్నారు. వీళ్ల పవర్‌ఫుల్ లుక్స్ అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నటుడు జాకీ ష్రాఫ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.
Last Updated : Aug 8, 2019, 3:57 PM IST