తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా దగ్గరున్న విషయమే నా అందానికి కారణం'

అజయ్​ దేవ్​గణ్​, రకుల్ ప్రీత్​ సింగ్​​ కలిసి నటించిన  'దే దే ప్యార్​ దే' చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా తర్వాత కాస్త విరామం దొరకడం వల్ల... ట్విట్టర్లో అభిమానులతో చిన్నపాటి చిట్​చాట్​ పెట్టిందీ అందాల భామ​.

'నా దగ్గరున్న విషయమే నా అందానికి కారణం'

By

Published : May 21, 2019, 10:20 PM IST

గంట సమయం పాటు అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన రకుల్​ తన మనసులోని విషయాలు వెల్లడించింది. కొంత మంది నటీనటులపై తన అభిప్రాయాలు, అందానికి రహస్యం వంటి వివరాలు వెల్లడించింది. నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు రకుల్​ సమాధానమిలా...

దే దే ప్యార్​ దే చిత్రంలో రకుల్​
  • మీ జీవితంలో గొప్పగా ఫీలయ్యే విషయం.?

నేను చేసిన పని సరైనదే​ అని నా తల్లిదండ్రులు భావించిన ఏ సందర్భమైనా నాకు గొప్ప విషయమే.

  • మీరు విశ్రాంతి తీసుకోడానికి ఇష్టపడే ప్రదేశమేది..?

నా స్నేహితులతో ఎక్కడున్నా ఇష్టమే. ప్రదేశం కన్నా తోడు ముఖ్యం.

సినీ స్నేహితులతో
  • మీకిష్టమైన​ పాట?

ప్రస్తుతం 'దే దే ప్యార్​ దే' పాటలే నా మొదడులో తిరుగుతున్నాయి.

  • హీరో సూర్య ఎన్​జీకే చిత్రం నుంచి మీకు నచ్చిన పాట ఏంటి.?

అన్​బే పేరన్​బే పాటంటే ఇష్టం.

అన్బే పేరన్బే పాట
  • మీ అభిరుచేంటి.?

నటనే.

  • హీరో సూర్యతో మళ్లీ నటిస్తారా..?

నా దగ్గరకుమంచి కథ వస్తే కచ్చితంగా చేస్తా... ఆయనతో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా.

ఎన్డీకేలో సూర్య సరసన.
  • ఇష్టమైన పర్యటక ప్రదేశం.?

లండన్.

  • ​మీ అందానికి రహస్యం.?

ఆనందంగా ఉండటం, విషయం కలిగి ఉండటమే అసలు రహస్యం.

అందాల భామ రకుల్​
  • తలా అజిత్​తో అవకాశం వస్తే నటిస్తారా..?

అవును. చేయాలనుంది.

  • మీరు ప్రశాంతంగా ఉండటానికి కారణం.?

నా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చింది.

తల్లిదండ్రులతో రకుల్​
  • మార్వెల్​ సూపర్​ హీరోల్లో ఎవరంటే మీకిష్టం?

ఐరన్​ మ్యాన్​

  • మన్మథుడు2 షూటింగ్​ ఎలా ఉంది?

అమేజింగ్​గా కొనసాగుతోంది. సెట్​ అంతా చాలా ప్రేమగా, సరదాగా ఉంటుంది.

మన్మధుడు చిత్రబృందంతో.
  • అనుకోకుండా రాజమౌళి దర్శకత్వంలో పనిచేసే అవకాశం వస్తే ఎలా స్పందిస్తారు..?

వెంటనే సంతకం చేసేస్తా..

  • ఒత్తిడిగా ఫీలైతే ఏం చేస్తారు..?

నా స్నేహితులు, కుటుంబంతో సరదాగా గడుపుతా..

  • ఫిట్​నెస్​ రహస్యం..?

ఫిట్​నెస్​ సీక్రెట్​ కాదు. నా జీవితంలో అది ఓ​ భాగమైపోయింది.

కసరత్తులు చేస్తోన్న రకుల్​
  • మీకిష్టమైన నటీమణులు.?

ఆలియా భట్​, అనుష్క శర్మ, కాజోల్.​

  • కొందరు నటీనటుల గురించి..?

అజయ్​ దేవగణ్​ -- అమేజింగ్​ పర్సన్​, అతడితో చాలా సెక్యూర్​గా అనిపిస్తుంది.
సమంత-- ఐ లవ్​ సమంత. నా దృష్టిలో ఆమె ఒక శక్తిమంతమైన మహిళ
సాయిపల్లవి-- నిజాయతీ, ప్రతిభ, కష్టపడే తత్వం.
అల్లు అర్జున్​ -- నాకు తెలిసిన వాళ్లలో మంచివ్యక్తి​.
సిద్దార్ధ్​​ మల్హోత్రా -- కష్టపడేతత్వం.

సిద్దార్ధ్​​ మల్హోత్రా పక్కన
  • మిమ్మల్ని మూడు కోరికలు కోరుకోమంటే ఏది కోరుకుంటారు..?

ఎంత తిన్నా లావవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఈ ఒక్క కోరిక చాలు.

తిన్నా లావవ్వకూడదంటున్న రకుల్​
  • మీకు ఫిట్​నెస్​ సెంటర్లు ఉన్నాయని తెలుసు. మీ అందం, ఫిట్​నెస్​ వెనుక రహస్యమేంటి?

నిబద్ధత, నన్ను నేను ప్రేమించుకోవడం.

రకుల్​ సొంత ఫిట్​నెస్​ సెంటర్లో సహా నటీనటులతో
  • తదుపరి చిత్రాలు.?

ఎన్​జీకే.. మే 31 విడుదల( తమిళంలో). మర్జావన్​(హిందీ).

ABOUT THE AUTHOR

...view details