తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫీల్​ మై లవ్​'... 15ఏళ్ల తర్వాతా అదే ప్రేమ - dil raju

'ఆర్య' సినిమా విడుదలై 15 ఏళ్లయింది. ఈ సందర్భంగా అభిమానులకు ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు బన్నీ.

అల్లు అర్జున్

By

Published : May 7, 2019, 1:19 PM IST

అల్లు అర్జున్ కెరియర్​లో 'ఆర్య' మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు గడిచింది. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అభిమానులకు ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

‘"నేను ఇప్పటికీ అదే ప్రేమను ఫీలవుతున్నాను. నా జీవితంలో 'ఆర్య' మ్యాజికల్‌ మూవీ. ఇది నా జీవితాన్ని మార్చేసింది. సినిమా విడుదలై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, రత్నవేలు, దిల్‌రాజు అందరికీ ధన్యవాదాలు. నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు" అంటూ 'ఆర్య' పోస్టర్‌ను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు.

ఈ సినిమాకు సీక్వెల్‌గా 2009లో సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో 'ఆర్య 2' వచ్చింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం రాబోతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయిక.

ఇవీ చూడండి.. బిగ్​ బీ, ఇమ్రాన్ సినిమా షూటింగ్ 10న షురూ

ABOUT THE AUTHOR

...view details