'సవ్యసాచి'లో తన తండ్రి నాగార్జున హిట్ గీతం "నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయత్తు"కు స్టెప్పులేసి అలరించిన అక్కినేని నాగచైతన్య.. ఇప్పుడు మరో కొత్త చిత్రం కోసం తాత ఏఎన్ఆర్ మధుర గీతాలతో అల్లరి చేయబోతున్నాడట. ఈ అక్కినేని హీరో ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ' చిత్రం చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. తెలంగాణలో జరిగే సరికొత్త ప్రేమకథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు చైతూ. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడొక ఆసక్తికర వార్త బయటకొచ్చింది.
ఏయన్నార్ పాటకు నాగచైతన్య స్టెప్పులు..!
నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'లవ్‌స్టోరీ'లో ఓ పాత పాటను రీమేక్ చేస్తున్నట్టు సమాచారం. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది.
ఏయన్నార్ పాటకు నాగచైతన్య స్టెప్పులు
ఇందులో చైతూ.. సాయి పల్లవిని అల్లరి చేసే ఓ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. ఆ సీన్‌ను అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లోని పలు అల్లరి పాటలతో వినోదాత్మకంగా రూపొందిస్తారని సమాచారం. ఈ ఎపిసోడ్లో ఆ పాటలన్నింటికీ చైతూ.. తన తాతగారి స్టైల్లో అదిరిపోయేలా స్టెప్పులు వేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే సినిమాకు ఈ భాగం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఇదీ చూడండి.. ఆ దర్శకుడి కథకు హీరో రామ్‌చరణ్ ఫిదా!
Last Updated : Feb 28, 2020, 10:53 AM IST